పిల్లలారా, నాలుక యొక్క రుచిని విడిచిపెట్టకపోతే హృదయం యొక్క రుచిని అనుభవించలేము.   ఈ ఆహారం తినాలి, ఇది తినకూడదు అని ఖచ్చితంగా చెప్పటం సాధ్యం కాదు. వాతావరణములోని మార్పులననుసరించి ఆహారానికి మన పైన ఉన్న ప్రభావం కూడా మారుతుంటుంది. ఇక్కడ (దక్షిణ భారతదేశంలో) తినకూడనిది హిమాలయాల్లో మంచిదవుతుంది. ఆహారం తినడానికి వచ్చి కూర్చున్నప్పుడు భగవంతుని స్మరించిన తరువాతే తినాలి. అందుకే తినడానికి ముందు మంత్రం జపించేది.  ఆహారం ముందు ఉన్నప్పుడే మన సహనాన్ని పరీక్షించటానికి సరైన […]