విద్యాభ్యాస రంగంలో ఆశ్రమం అడుగిడింది. “అమృత విశ్వవిద్యాపీఠం” క్రింద 5 క్యాంపస్ లలో ఇంజనీరింగ్, ఎం.బి.బి.ఎస్, డెంటల్, ఫార్మసీ, నర్సింగ్, ఆయుర్వేదం, మ్యానేజ్ మెంట్, బయోటెక్నాలజీ, బి.ఎడ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, విజువల్ కమ్యూనికేషన్స్, ఫైన్ ఆర్ట్స్, జర్నలిజమ్ వంటి విభాగాలలో విద్యాభ్యాసము నడుస్తున్నది. ఐ.టి., ఇంజనీరింగ్, మెడిసన్ రంగాలలో, అధిక సంఖ్యలో రిసర్చ్ లు, సాటిలైట్ నెట్ వర్క్ సహాయంతో ఈ అమృత యూనివర్సిటీలో నడుస్తూ ఉన్నవి.

అమృత విద్యాలయాలు
దేశం మొత్తంగా 53 అమృత విద్యాలయాలు నడుస్తున్నాయి. అన్ని విద్యాలయాలలో పేద విద్యార్ధులకు ఉచిత విద్యాభ్యాసమును కూడా ఇస్తున్నది మాతా అమృతానందమయి మఠం.