అమ్మ అని పిలువబడే మాతా అమృతానందమయి దేవి తమ ప్రేమ, మరియు ఆత్మత్యాగభరితము అయిన అసమాన కృత్యాల వలన ప్రపంచవ్యాప్తంగా లక్షల జనాలకు ప్రీతిపాత్రులయ్యారు. తమ వద్దకు వచ్చిన వారిని అమ్మ, తమ ప్రేమాలింగనంలో ఇముడ్చుకుని, దయతో ఆదరిస్తూ, జాతిమత భేదాలు చూడకుండా, ఎవ్వరు, ఎందుకు వచ్చారు అన్న విషయాలు ఎంచకుండా, అవధులులేని ప్రేమను వారిపై కురిపిస్తారు. అతి సాధారణము, అదే సమయంలో అతి శక్తివంతము అయిన ఈ రీతిలో ఒక్కొక్కరిని ఆలింగనం చేసుకుంటూ వారి హృదయాలను వికసింపజేస్తూ అమ్మ లెక్కలేనంత మంది వ్యక్తుల జీవితాలలో పరివర్తనను సృష్టిస్తున్నారు. గత 36 సంవత్సరాలలో, ప్రపంచవ్యాప్తంగా దాదాపు ౩ కోట్ల మంది వ్యక్తులను అమ్మ ఆలింగనం చేసుకున్నారు.
ఇతరుల అభివృద్ధికై అవిరామమూ అలుపెరుగని అమ్మ యొక్క సమర్పణ భావం, విశాలమైన దాతృత్వ కార్యక్రమాలు గల సంస్థల స్థాపనకు నాంది పలికింది. వీటి ద్వారా నిస్వార్థసేవలో లభించే శాంతిసౌందర్యాలను ఎందరో కనుగొనగలుగుతున్నారు. సచేతన మరియు అచేతన వస్తువులన్నింటిలో పరమాత్మతత్త్వం ఉన్నదన్నది అమ్మ ఉపదేశం. సమస్తంలో అంతఃగర్భితంగా ఉన్న ఈ ఏకత్వాన్ని వీక్షించడం అన్నది ఆధ్యాత్మికసారమే కాక సమస్త ఆవేదనలకు నివారణసాధనం కూడా.
అమ్మ ఉపదేశాలు విశ్వజనీయమైనవి. అమ్మ మతం గురించి మాట్లాడినప్పుడల్లా, తమ మతం ప్రేమ అని తెలిపారు. అమ్మ ఎవ్వరినీ భగవంతుని నమ్మమని అనరు. అంతేకాక, మతం మార్చుకోమని కూడా అనరు. వారు కేవలం తమ తమ నిజతత్త్వాన్ని గురించి తెలుసుకుని ఆ తత్త్వాన్ని విశ్వసించమని కోరుతారు.

Download Amma App and stay connected to Amma