2004 లో సునామి అలలు ఆసియా భూఖండంలో అనేక దేశాలను విధ్వంసం చేసాయి, కేరళలో సముద్రతీరానున్న ఆలప్పాడు పంచాయతీని కూడా విడువలేదు.
ఆశ్రమంలో ఉన్న 20,౦౦౦ స్వదేశ మరియు విదేశీయులైన భక్తులను రక్షించడమే కాక అనేక వేల సంఖ్యలో వచ్చిన ఆ ప్రాంతపు జనాలను, తమకున్నదంతా నష్టపోయి శరణార్ధులుగా వచ్చిన దుఃఖితులైన జనాలను గుండెలకు హత్తుకున్నారు అమ్మ. వారికి తట్టుకోగలిగే శక్తినిచ్చారు అమ్మ. కేరళ, తమిళనాడు, అండమాన్ ద్వీపాలు, శ్రీలంక వంటి స్థలాలలో మాతా అమృతానందమయి మఠం సునామి బాధితులకు పునరావాస పధకాలను నిర్వహిస్తూ వచ్చింది.
సునామి వచ్చిన రెండు వారాలలోపునే, వేల సంఖ్యలో కుటుంబాలకి ఉండటానికి అభయ కేంద్రాలను తమిళనాడు మరియు కేరళలో నిర్మించారు. వారికి అవసరమయిన ఆహారం, వస్త్రాలు, చికిత్స వంటివి ఆనాటి నుండి ఇస్తూనే ఉన్నారు. సునామి ఏర్పరిచిన మానసిక అగాధం నుండి వారికి శాంతి సమాధానము తిరిగి లభించేందుకు గాను పలు కార్యక్రమాలను మఠం నిర్వహిస్తూ వచ్చింది.
కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ ద్వీపాలు, శ్రీలంక వంటి స్థలాలలో 6200 ఇళ్ళు కట్టే తీర్మానం తీసుకోబడింది. వాటిలో 4200 ఇళ్ళ నిర్మాణం పూర్తి అయ్యింది.
కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో సునామీచే బాధించబడిన అన్ని జిల్లాలలో మాతా అమృతానందమయి మఠం ప్రప్రధమంగా గృహనిర్మాణ కార్యక్రమం పూర్తి చేసింది.
సునామి గృహనిర్మాణానికై మొదలు పెట్టినప్పటినుండి రెట్టింపు ఖర్చైనది. సునామి పునరావాస పద్ధతిలో పాల్పంచుకోడానికి ఆశ్రమ వాసులు, భక్తులు అందరి శ్రమదానం చేర్చి లెక్కకడితే 200 కోట్ల రూపాయలు అవుతుందని భావిస్తున్నారు.
ఒక ప్రక్క ఉప్పుటేరు, మరొక ప్రక్క సముద్రము ఉన్న ద్వీపం మీద ఉన్నది అమృతపురి ఆశ్రమం. 11 కిలోమీటర్ల దూరం వరకు ఈ ద్వీపానికి వంతెన లేదు. సునామి సమయంలో నీళ్ళలో అవతల ప్రక్కకు వెళ్ళేందుకు ప్రయత్నించిన గ్రామ వాసులలో కొంత మంది మరణించడం అమ్మకు అగాధమైన దుఃఖం కలిగించింది. “ఒక వంతెన ఉండి ఉంటే అంత మంది మరణించే వారు కాదు కదా. ఒక వంతెన కట్టాలి” అని ఆ నాడు అమ్మ తీర్మానించారు. ఒక్క సంవత్సరంలో అమృత సేతు వంతెనను నిర్మించటం జరిగింది. మన రాష్ట్రపతి డా. ఏ. పి. జె. అబ్దుల్ కలామ్ గారు 2006 సంవత్సరంలో అమృత సేతు వంతెనను జనాలకు సమర్పించారు. ఇప్పుడు సునామి సంభవించిన ఎడల ౩౦ నిమిషాలలో గ్రామవాసులందరినీ ఆవతల ఒడ్డుకు చేర్చేందుకు వంతెన సహకరిస్తుంది.
కేరళలో తీర ప్రాంతాలలో ఒక లక్ష సర్వీ చెట్లను నాటడం జరిగింది. మరొక సునామి వచ్చిన ఎడల, ఈ చెట్లు సునామీ తీవ్రతను కొంత వరకు తగ్గిస్తాయని భావిస్తున్నారు.
10,000 మంది పిల్లలకు 10 దినాలు యోగ, సంస్కృతం, ఇంగ్లీషు, ఈత కొట్టడంలో శిక్షణా తరగతులు, కౌన్సెలింగ్ వంటివి జరిగాయి. పిల్లల మానసిక విభ్రాంతిని, నీటి భయన్ని పోగొట్టి జీవితంలో ఎన్నో సాధించాలన్న ప్రత్యాశ వారిలో కలిగంచడానికి ఇది ఎంతగానో సహకరించింది.
ఇంతే కాక కేరళ మరియు తమిళనాడులో జాలర వృత్తులలో ఉన్న అనేక మంది మత్స్యకారులుకు పడవలు, వలలు ఇచ్చారు. అలెప్పి, కొల్లం, కొచ్చి వంటి జిల్లాలలో కుటుంబాల వారికి వంట పాత్రలు కొనుక్కునేందుకు ఒక కోటి రూపాయలు వితరణం చేసారు.
సునామి ప్రదేశాలలో 2500 యువతీయువకులకు మాతా అమృతానాందమయి మఠం యొక్క వివిధ సంస్థలలో సెక్యూరిటీ, డ్రైవింగ్, బి.ఎడ్. వంటి రంగాలలో శిక్షణ మరియు ఉద్యోగాలు ఇవ్వబడ్డాయి.