సామాన్య జనాలకు సౌజన్యమున్న చికిత్స అందించేందుకు కొచ్చిలో ఉన్న అత్యాధునిక చికిత్సా కేంద్రం “అమృత ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసర్చ్ సెంటర్”. 1300 పడకలు గల ఈ ఆసుపత్రిలో అత్యాధునికి సౌజన్యాలున్న క్యాన్సర్ చికిత్సా కేంద్రమూ, నానో టెక్నాలజీ రిసర్చ్ సెంటరు కూడా ప్రారంభించబడ్డాయి.

Amrita Hospital

1998 నుండి ఇప్పటి వరకు 149 కోట్ల రూపాయలు విలువ చేసే చికిత్స మరియు మందులు ఈ సంస్థ నుండి రోగులకు అందించబడ్డాయి.

కొచ్చిలో ప్రారంభించబడ్డ ఏ.ఐ.ఎమ్.ఎస్ కాక ముంబయిలో “అమృత క్యాన్సర్ కేర్ హోమ్”, తిరువనంతపురంలో ఉన్న “అమృత ఎయిడ్స్ కేర్ సెంటర్”, కల్పట్టిలో ఆదివాసులకు నిర్వహించబడుతున్న “అమృత కృపాసాగర్ చారిటబుల్ ఆసుపత్రి”, అమృతపురిలో తీర ప్రాంతాల వారికి సౌజన్య చికిత్స ఇచ్చేందుకు “అమృత కృప ఆసుపత్రి” వంటివి చికిత్సా రంగంలో మాతా అమృతానందమయి మఠం కానుకలు.