త్యాగోజ్వాలయై కర్మపధంలో అమ్మ తన యాత్రను ప్రారంభించి 40 సంవత్సరాలయ్యాయి. కడపటి శ్వాస వరకు తమ చేతులు దుఃఖితుల కన్నీరు తుడుస్తూ వారిని ఊరడిస్తూ స్వాస్థ్యమునిస్తూ గడపాలన్నదే అమ్మయొక్క కోరిక. అమ్మయొక్క ఈ కారుణ్యం వలనే, అమ్మయొక్క కర్మ మండలంలో అవధులు లేవు, ఈ విశ్వమంత విస్తారమైనవి.
జీవితం గురించి అమ్మకు ఒక వీక్షణముంది. అమ్మ అన్నారు: రెండు విధములైన దారిద్ర్యములు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. ఒకటి: అహారం, వస్త్రముల లోపం వల్ల అనుభవిస్తున్న దారిద్ర్యము. ఇక రెండవ దారిద్ర్యము: ప్రేమ కారుణ్యాల లోపం వల్ల మనం అనుభవిస్తున్న దారిద్ర్యము. ఇది మార్చడానికి ప్రయత్నిస్తే మెదటి దారిద్ర్యము దానంతటదే మారగలదని అమ్మ చెప్పారు.
ఇప్పుడు మాతా అమృతానందమయి మఠంయొక్క కార్యక్రమాలు వేల సంఖ్యలో శాఖోపశాఖలుగా లోకమంతటా వ్యాపించాయి. మఠంయొక్క జీవకారుణ్యం పథకాలు విస్తరించని క్షేత్రమే లేదనవచ్చు. ఆసుపత్రులు, స్కూళ్ళు, కాలేజీలు, టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు, విశ్వవిద్యాలయాలు, విజ్ఞాన విస్తారణ పధకాలు, పర్యావరణ సంరక్షణ పధకాలు, ఆదివాసి సంక్షేమ కార్యక్రమాలు, వృద్ధాశ్రమాలు, పునరావాస పధకాలు, ఇలా ఉంటుంది విస్తారమైన పీఠిక.
2004 సునామీకి మాతా అమృతానందమయి మఠం 200 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలను అద్భుత రీతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమాలు జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని స్పృశిస్తూ వేలాది జనాలను చేరాయి. మఠం యొక్క ఈ కార్యక్రమాల వలన ఐక్య రాజ్య సమితి మఠానికి “కన్సల్టేటివ్ స్టేటస్”ని (Consultative Status) ఇచ్చింది. మఠం యొక్క పూర్తి సునామీ సేవా కార్యక్రమాలను గురించి ఇక్కడ చదవండి.
అమెరికాలొ కత్రినా తుఫాను వల్ల జరిగిన బీభత్సం సంభవించినప్పుడు 4.5 కోట్ల రూపాయల విరాళం అమ్మ ఇచ్చారు.
2005లో పాకిస్తాన్ మరియు కాశ్మీరు సరిహద్దులలో భూకంపం వచ్చినప్పుడు అమ్మ సంఘ సేవకులను పంపించి, అక్కడ వారికి ఆహారం, మందులు, కంబళ్ళు వంటి నిత్యావసర వస్తువులను అందించారు.
2005లో ముంబయిలో, 2006 గుజరాత్ లో వరదల సమయలో వైద్యులను, అంబులెన్సులను, పునరావాస సపరిచర్యలు అందించేందుకు పంపారు. వారికి ఆహారం, మందులు మరియు చికిత్సలు అందించారు.