విమానం & టాక్సీ ద్వారా:
ఆశ్రమానికి అతి దగ్గరలో ఉన్న విమానాశ్రయాలు తిరువనంతపురం లోను (అమృతపురికి 110 కి.మీ. దక్షిణాన), కొచ్చిన్ లోను (140 కి.మీ. ఉత్తరాన) ఉన్నాయి. అంతర్జాతీయ అతిధులు తమని విమానాశ్రయం లేదా హోటల్ నుంచి టాక్సీలో తీసుకురావడానికి, ఈ ఫారం నింపండి.

మీరు ముందే టాక్సీ బుక్ చేసుకొని ఉండకపోతే, విమానాశ్రయంలోని “టాక్సీ సర్వీస్” కౌంటరుకి వెళ్ళి అమృతపురిలోని “మాతా అమృతానందమయి మఠం”కు ప్రీ-పెయిడ్ టాక్సీని తీసుకోవచ్చు.

తిరువనంతపురం నుంచి ప్రయాణం సుమారు మూడు గంటలు పడుతుంది. ఏ.సి. లేని కారుకి ఛార్జీ రూ. 1,600. కొచ్చిన్ నుంచి ప్రయాణం, సుమారు నాలుగు గంటలు పడుతుంది. ఛార్జీ సుమారు రూ. 2,400 (2008 సెప్టెంబరు). “బీచ్ రోడ్” ద్వారా అమృతపురి చేరాలని చెప్పండి. ఈ దారిలో వస్తే మీరు కయ్యిని (backwaters) దాటి తిన్నగా ఆశ్రమ ఆవరణలోకి వస్తారు. లేకపోతే, టాక్సీ మిమ్మల్ని వల్లికావులో విడిచి పెడుతుంది. అక్కడ నుంచి మీరు కొత్తగా కట్టిన “అమృత సేతు” మీదగా నడిచి రావచ్చు. ఎక్కువ సామాను ఉంటే, మీరు కయ్యిని దాటటానికి పడవ తీసుకోవచ్చు.

బస్సు లేదా రైలు ద్వారా:
కయాంకులం (అమృతపురికి 12 కి.మీ. ఉత్తరాన), కరునాగపల్లి (10 కి.మీ. దక్షిణాన) అతి దగ్గరలో ఉన్న పట్టణాలు. అక్కడి నుంచి, మీరు ఆటో రిక్షా తీసుకుని, పైన చెప్పిన విధంగా ఆశ్రమం రావచ్చు. కయాంకులం రైల్వేస్టేషను (KYJ) నుండి “అమృత సేతు” వరకు బస్సులు కూడా ఉన్నాయి.

వివరణాత్మకమైన పటం

Google Map