21 మార్లు ప్రపంచమంతటా పర్యటించిన అమ్మ, జన్మించిన గృహమే ఆశ్రమంగా రూపొందించి, అదే మాతా అమృతానందమయి మఠంయొక్క హెడ్ క్వార్టర్స్ గా మార్చారు. కేరళ యొక్క మాతృభాష అయిన మలయాళంను ఐక్య రాజ్య సమితి వరకు చేర్చారు అమ్మ.

1993లో షికాగోలో జరిగిన విశ్వశాంతి సమ్మేళనంలో 150 దేశాల నుండి వచ్చిన 6500 మంది ప్రతినిధులలో ప్రధమ సంబోధన చేసి ప్రసంగించినది అమ్మ.

1995 ఐక్యరాజ్య సమితి 50వ వార్షికోత్సవం న్యూయార్క్ లో సెయింట్ జోన్స్ కథీడ్రాల్ లో జరిగినప్పుడు మలయాళంలో అమ్మ పలికిన మధురమైన వాక్యాలు లోకం విన్నది.

2000 లొ నూతన సహస్రాబ్ది ప్రారంభోత్సవాలు జరిగిన సందర్భంలో, ప్రత్యేక ఆహ్వానితగా అమ్మ న్యూయార్క్ ఐ.రా.స. జనరల్ అసెంబ్లీ హాలులో ముఖ్య ప్రసంగాన్ని అందించారు.

2002లో జనీవాలో ఐక్యరాజ్య సదస్సులో లోక వనితల “మత / ఆధ్యాత్మిక నేతలయొక్క సమ్మేళనం”లో అమ్మ ప్రధాన ప్రసంగాన్ని ఇచ్చారు. స్త్రీలో నిద్రాణమైన అనంత శక్తిమయమైన మాతృత్వాన్ని మేల్కొలుపే అమ్మ ఆహ్వానమైనది. ఆ రోజు ఆ సదస్సులో శాంతికై నెలకొల్పిన “గాంధీ కింగ్” పురస్కారాన్ని ఇచ్చి అమ్మని సన్మానించారు.

2003 లో కొచ్చిలో జరిగిన అమృతవర్షం 50లో, అమ్మ 50వ జన్మదినం ఉత్సవాలలో దాదాపు 191 దేశాల నుండి ప్రతినిధులు పాల్గొని లోక శాంతికై ప్రార్ధనలు చేసారు.

2004 స్పైన్ లో బార్సిలోనాలో జరిగిన విశ్వశాంతి సమ్మేళనంలో అమ్మ ప్రధాన వక్తయై ప్రసంగించారు.

2005 లో సౌత్ ఫ్రాన్స్ యూనివర్సిటీ అమ్మకు “ఇంటర్నేషనల్ ప్యాట్రన్ మదర్” బిరుదునిచ్చి గౌరవించారు.

2006 లో న్యూయార్క్ లో ఇంటర్ ఫైత్ సెంటర్‍లో “జేమ్స్ పార్క్స్ మోర్టన్” పురస్కారాన్ని అమ్మకు ఇచ్చారు.

ఫ్రాన్స్‌కి చెందిన “సినిమా వెరిటె” సంస్థ తమ

2007వ వార్షిక పురస్కారాన్ని పారిస్‌లో అమ్మకు ప్రదానం చేసారు.

2008లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రపంచ శాంతికై లోక వనితల “మత / ఆధ్యాత్మిక నేతలయొక్క సమ్మేళనం”లో అమ్మ ప్రసంగించారు.

2010లో అమెరికాలో న్యూయార్క్‌లోని స్టేట్‌ యూనివర్సిటీ అమ్మకు గౌరవ డాక్టర్‌రేట్‌ను ప్రదానం చేసింది