Category / సందేశం

ప్రశ్న: అమ్మా, ఎన్నో సంవత్సరాలుగా నేను ఆధ్యాత్మిక అనుష్ఠానాలు చేస్తున్నప్పటికీ నాకింతవరకు ఎటువంటి అనుభవమూ కలుగలేదెందుకు? అమ్మ: నాయనా, అమ్మ వద్దకు వస్తున్న చాలా మంది పిల్లలు ఈ విధంగా అమ్మకు చెప్తుంటారు. గృహస్థులైన అమ్మ పిల్లలు కూడా అమ్మకు చెప్తుంటారు, “ఎంతసేపు ధ్యానమూ, జపమూ చేసినప్పటికీ కూడా మాకు ఎటువంటి మేలు కనిపించడం లేదు” అంటూ. పిల్లల్లారా, ప్రార్థనలు చెయ్యడానికిగాను మనం భక్తితో ఆలయాలకు వెళ్తాము, గుడిలో విగ్రహానికి ముమ్మారు ప్రదక్షిణం చేస్తాము. మనం విగ్రహం […]

“కృష్ణ భగవానుడు చేసింది తప్పు కాదా?” అని మనం అనుకోవచ్చు. భగవంతుడి ఏకైక ధ్యేయం ధర్మాన్ని రక్షించడమే అన్నది మనం విస్మరించకూడదు. ఏదో ఒక సందర్భాన్ని బట్టి ఏది మంచో, ఏది చెడో మనం తీర్పు చెప్పలేం. ఆ సందర్భానికి దారి తీసిన పరిస్థితులని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. దుర్యోధనుడి ప్రోద్బలంతోనే పాంచాలి వస్త్రాలని నిండు సభలో ఊడదీసే ప్రయత్నం జరిగింది. ఇది జరిగేప్పుడు ఆనందంగా తన తొడలని కొట్టుకున్న దుర్యోధనుడు ఆ అధర్మ కార్యానికి […]