Category / బోధనలు

అందరిలోనూ ఉన్న ఆత్మే నాలోనూ ఉన్నది. ఏదీ నా నుండి వేరుగా లేదు. వేరొకరి దుఃఖమూ, కష్టమూ నావే. ఇది అనుభూతిలోకి తెచ్చుకుని అర్థం చేసుకున్నవాడే ఙ్ఞాని. జన్మతః పాడగలిగినవాడికి, సంగీతం నేర్చుకున్న ఒకతనికి మధ్యగల వ్యత్యాసంలాగానే అవతారమూర్తికీ జీవుడికి మధ్య తేడా. జన్మతః సంగీత సంస్కారం ఉన్నవాడు ఒక పాట వింటే, వెంటనే నేర్చుకుంటాడు. వేరొకతను అది నేర్చుకోవటానికి కొంచెం సమయం తీసుకుంటాడు. సర్వమూ భగవదంశమే అయి ఉండటం చేత అందరూ అవతారమూర్తులే. అయితే, తాను […]

“దేవుడున్నాడా? ఉంటే ఎక్కడున్నాడు?” అని ఎందరో ప్రశ్నిస్తూంటారు. “కోడి ముందా, గ్రుడ్డు ముందా? కొబ్బరికాయ ముందా, కొబ్బరిచెట్టు ముందా?” అని వారిని అడగండి. అటువంటి ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పగలరు? కానీ, కొబ్బరికాయకి కొబ్బరిచెట్టుకి అతీతంగా, సర్వానికీ ఆధారమైన శక్తి ఒకటుంది. అదే భగవంతుడు. వాక్కుకి అతీతమైన, వ్యక్తపరచలేని ఒక విశేష శక్తి! సర్వానికీ బీజకారణం అయిన దాన్నే, పిల్లలారా, భగవంతుడు అంటారు. పిల్లలారా, దేవుడు లేడనటం తన నాలుకతో “నాకు నాలుక లేదు” అన్నట్లే ఉంటుంది. […]

మనకు అవసరమున్న వస్తువులన్నీ ఉన్న దుకాణమేదో తెలిసిన తరువాత, పిల్లలారా, బజారులో ఉన్న అన్ని దుకాణాల్లో తిరుగుట ఎందుకు? దాని వలన ఉపయోగం లేకపోగా సమయం కూడా వృధా అవుతుంది. అదే విధంగా, మనకు గురువు లభించినట్లైతే ఇక వృధా సంచారాన్ని చాలించి, గమ్యం చేరుటకు శ్రమిస్తూ సాధన చేయాలి. సాధకుని దగ్గరకు గురువు తానే వస్తాడు. అన్వేషించవలసిన అవసరం లేదు. సాధకుడు అటువంటి వైరాగ్యమున్నవాడు మాత్రం అయ్యుండాలి. ఒక సాధకునికి గురువు తప్పకుండా అవసరము. బిడ్డ […]

పిల్లలారా, మీకు జన్మనిచ్చిన తల్లి ఈ జన్మకి చెందిన అవసరాలను చూసుకోవచ్చు. ఈ రోజుల్లో అది కూడా చాలా అరుదు. కానీ ఈ జన్మలోనే కాక భావిజన్మలన్నింటిలోనూ పరమానందప్రాప్తి పొందుటకు సరియైన మార్గమున మిమ్ము నడిపించుటయే అమ్మ లక్ష్యం. పుండుని చిదిమి చీము తీసేటప్పుడు బాధ కలుగుతుంది. అలాగని నిజమైన వైద్యుడు చీము తీయక మానివేస్తాడా? అదే విధంగా మీ యొక్క చెడు సంస్కారాల్ని తొలగించేటప్పుడు బాధ కలుగుతుంది. అయినా అది మీ మంచికే. అంకురిస్తున్న మొక్కను […]