పిల్లలారా, కోరిక మరియు స్వార్థం నుండే అహంకారముదయిస్తుంది. ఇది సహజంగా జరిగినది కాదు, సృష్టించబడినది. మనకు రావలసిన బాకీ వసూలు చేయడానికి ఒక చోటుకి వెళ్లామనుకోండి. రెండు వందల రూపాయలు వస్తాయని ఆశించాము. కానీ యాభై రూపాయలు మాత్రమే వచ్చాయి. కోపంతో ఊగిపోతూ వాడిని కొడతాము. ఆ తరువాత కోర్టులో కేసు కూడా అవుతుంది. కోరిన మొత్తము దొరక్కపోవటం వలనే కదా కోపము వచ్చింది. చివరకు కోర్టు వరకు వెళ్ళవలసి వచ్చింది. శిక్ష పడితే భగవంతుడిని నిందించి […]