Tag / సాధకుడు

తుఫానులో మహావృక్షాలు వేళ్ళతో సహా పెకలించుకుపోతాయి. కట్టడాలు కూలిపోతాయి. కానీ ఎంత పెద్ద తుఫానైనా ఒక గడ్డిపోచను ఏమీ చేయలేదు. పిల్లలారా, అణకువ యొక్క మహత్వమిదే. ఇతరుల ముందు తల వంచడమనేది దుర్బలత కాదు. ఒక గడ్డిపోచ ముందు కూడా తల వంచగలిగే ఔన్నత్యము మనలో పెంపొందాలి. ఒకడు స్నానం చేయడానికి నదిలోకి దిగి, ‘నేను నదికి తల వంచను, నేను మునగను’ అని అంటే అతడి శరీరంలోని మలినాలు పోవు. ఆధ్యాత్మిక జీవి ఇతరుల ముందు […]

పిల్లలారా, ప్రాణులలోని జీవశక్తే కుండలిని. చుట్ట చుట్టుకుని పడుకుని ఉన్న ఒక ఆడ పాము ఆకృతిలో వెన్నెముక క్రింది భాగంలో ఈ శక్తి ఉంటుంది. ధ్యానము వలన కానీ, గురు కృప వలన కానీ ఈ శక్తి మేల్కొంటుంది. మేల్కొన్నాక శిరస్సులో ఉంటున్న మగ పాముని చూసిన వ్యాకులతతో, వెన్నెముకలోని సుషుమ్న ద్వారా ఈ శక్తి పైకి దూకుతుంది. సుషుమ్నలోని ఒక్కో ఆధారము ఒక చిన్న రంధ్రము లాగా కనపడుతుంటుంది. ఒక ఆధారములో నుండి వేరొక ఆధారములోకి […]

ఒకరు పండిన పనసపండుని తినడానికి ఇష్టపడతారు. ఒకరు ఉడికించినది తింటారు, వేరొకరికి వేయించినది కావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటే ఇష్టం. ఎట్లా తిన్నా ఆకలి తీరటమే లక్ష్యం. అదే విధంగా, భగవంతుడిని తెలుసుకోవటానికి ఒక్కొక్కరూ ఒక్కో మార్గం అనుసరిస్తున్నారు. పిల్లలారా, ఏ మార్గంలో వెళ్ళినా లక్ష్యం ఒక్కటే, భగవత్సాక్షాత్కారము. తత్వజ్ఞాన రహితమైన భక్తి మనిషిని బంధించటానికి మాత్రమే సహాయ పడుతుంది. అది ముక్తుడిని చేయలేదు. వేర్లు విస్తరిస్తున్న మల్లెతీగ, వేరే చెట్టులను బంధించకుండా, పైకి పెరగలేదు. […]

ప్రశ్న: సాధకులకు కోపం రాకూడదు అని ఎందుకు అంటారు? అమ్మ: పిల్లల్లారా, ఆధ్యాత్మిక అన్వేషకునికి కోపం రాకూడదు. కోపం వచ్చినప్పుడు మనం సాధనద్వారా పొందిన శక్తినంతటినీ నష్టపోతాము.  కేవలం మన నోటి ద్వారానే కాదు మనం శక్తిని కోల్పోయేది, మన ప్రతి రంధ్రము నుండి కూడా శక్తిని నష్టపోతుంటాము. సిగరెట్టు లైటరు 10-20 మార్లు ఉపయోగిస్తే దానిలో ఉన్న ఇంధనం ఖర్చు అవుతుంది. ఇది కనిపించనప్పటికీ మనకు తెలుసు. పిల్లల్లారా, అదే విధంగా ఉన్నతమైన ఆలోచనల ద్వారా […]