Tag / సద్గురువు

పిల్లలారా, ప్రాణులలోని జీవశక్తే కుండలిని. చుట్ట చుట్టుకుని పడుకుని ఉన్న ఒక ఆడ పాము ఆకృతిలో వెన్నెముక క్రింది భాగంలో ఈ శక్తి ఉంటుంది. ధ్యానము వలన కానీ, గురు కృప వలన కానీ ఈ శక్తి మేల్కొంటుంది. మేల్కొన్నాక శిరస్సులో ఉంటున్న మగ పాముని చూసిన వ్యాకులతతో, వెన్నెముకలోని సుషుమ్న ద్వారా ఈ శక్తి పైకి దూకుతుంది. సుషుమ్నలోని ఒక్కో ఆధారము ఒక చిన్న రంధ్రము లాగా కనపడుతుంటుంది. ఒక ఆధారములో నుండి వేరొక ఆధారములోకి […]

మనకు అవసరమున్న వస్తువులన్నీ ఉన్న దుకాణమేదో తెలిసిన తరువాత, పిల్లలారా, బజారులో ఉన్న అన్ని దుకాణాల్లో తిరుగుట ఎందుకు? దాని వలన ఉపయోగం లేకపోగా సమయం కూడా వృధా అవుతుంది. అదే విధంగా, మనకు గురువు లభించినట్లైతే ఇక వృధా సంచారాన్ని చాలించి, గమ్యం చేరుటకు శ్రమిస్తూ సాధన చేయాలి. సాధకుని దగ్గరకు గురువు తానే వస్తాడు. అన్వేషించవలసిన అవసరం లేదు. సాధకుడు అటువంటి వైరాగ్యమున్నవాడు మాత్రం అయ్యుండాలి. ఒక సాధకునికి గురువు తప్పకుండా అవసరము. బిడ్డ […]