పిల్లలారా, ఋషులయొక్క అనుభవమే శాస్త్రం. అది బుద్ధితో తెలుసుకోగలిగినది కాదు. అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలము. శాస్త్రం మహాసముద్రమువలె విశాలమైనది. అది అంతా మనకు అవసరము లేదు. సముద్రములోని రత్నాల వలె, శాస్త్రాలలోని తత్వములే మనకు అవసరము. చెరుకు తింటున్నవాడు రసాన్ని మాత్రమే తీసుకుంటాడు. పిప్పి ఉమ్మివేస్తాడు. సాధన చేసినవాడు మాత్రమే శాస్త్రాలలోని సూక్ష్మాంశాలను గ్రహించగలడు. శాస్త్రపఠనము మాత్రమే పరిపూర్ణత్వానికి దారి తీయదు. మందు సీసాపై ఈ విధంగా మందు తీసుకోవాలని వ్రాసి ఉంటుంది. రోగం నయమవటానికి […]