“దేవుడున్నాడా? ఉంటే ఎక్కడున్నాడు?” అని ఎందరో ప్రశ్నిస్తూంటారు. “కోడి ముందా, గ్రుడ్డు ముందా? కొబ్బరికాయ ముందా, కొబ్బరిచెట్టు ముందా?” అని వారిని అడగండి. అటువంటి ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పగలరు? కానీ, కొబ్బరికాయకి కొబ్బరిచెట్టుకి అతీతంగా, సర్వానికీ ఆధారమైన శక్తి ఒకటుంది. అదే భగవంతుడు. వాక్కుకి అతీతమైన, వ్యక్తపరచలేని ఒక విశేష శక్తి! సర్వానికీ బీజకారణం అయిన దాన్నే, పిల్లలారా, భగవంతుడు అంటారు. పిల్లలారా, దేవుడు లేడనటం తన నాలుకతో “నాకు నాలుక లేదు” అన్నట్లే ఉంటుంది. […]