Tag / ప్రేమ

ధ్యానమంటే ఏమిటో, ఎలా ఎక్కడ ధ్యానము చేయాలో, ఎలా ధ్యానము చేయకూడదో, జపము కూడా ధ్యానములో ఎలా ఒక భాగమో, అమ్మ, సద్గురువు శ్రీ మాతా అమృతానందమయి దేవి, వివరిస్తున్నారు.

కారుణ్యం గలవారు: ప్రేమ కూడా కలిగి ఉంటారు. ప్రేమ, కారుణ్యం ఒకే నాణెమునకున్న రెండు ముఖాలు. ఇతరుల పట్ల కారుణ్యం తనలో కలిగినప్పుడు స్వార్ధం దానంతటదే విడిచి పెడ్తున్నదని గ్రహిస్తాడు. ఎలాగైతే ఉప్పు నీటిలో మంచి నీళ్ళు పోస్తున్న కొద్దీ ఆ నీటి ఉప్పదనం మాయమవుతుందో, మంచిని గురింని నిరంతరం ఆలోచించే వానిలో చెడు ధోరణులు మాయమవుతుంటాయి. ఇతరుల కష్టనష్టాలు తనవిగా భావిస్తాడు. అటువంటి వారి మనస్సు విస్తారమై అంతటా ఐక్యతను చూస్తుంది. దేహంలో ఒక భాగానికి […]