ప్రాణాయామము చేసేటప్పుడు వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి. ఎంతో శ్రద్ధతో మాత్రమే అభ్యసించాలి. సాధారణంగా కలిగిన జబ్బులకు చికిత్స చేసి నయం చేయవచ్చు, కానీ తప్పుగా ఆచరించిన ప్రాణాయామము వలన కలిగిన జబ్బులకు చికిత్స చేసినా నయమవ్వవు. ప్రాణాయామము చేస్తున్నపుడు పొత్తికడుపు భాగంలోని పేగు కదలికకు లోనవుతుంది. దీని అంతటికీ ఒక క్రమముంది. మాత్రాక్రమము1. ఈ క్రమాన్ని ఉల్లంఘించిన వారి పేగు వదులవుతుంది. తరువాత, తిన్న ఆహారం జీర్ణము అవ్వకుండా అలాగే మలము అవుతుంది. అందువలన, పూర్ణుడయిన […]