ఒకరు పండిన పనసపండుని తినడానికి ఇష్టపడతారు. ఒకరు ఉడికించినది తింటారు, వేరొకరికి వేయించినది కావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటే ఇష్టం. ఎట్లా తిన్నా ఆకలి తీరటమే లక్ష్యం. అదే విధంగా, భగవంతుడిని తెలుసుకోవటానికి ఒక్కొక్కరూ ఒక్కో మార్గం అనుసరిస్తున్నారు. పిల్లలారా, ఏ మార్గంలో వెళ్ళినా లక్ష్యం ఒక్కటే, భగవత్సాక్షాత్కారము. తత్వజ్ఞాన రహితమైన భక్తి మనిషిని బంధించటానికి మాత్రమే సహాయ పడుతుంది. అది ముక్తుడిని చేయలేదు. వేర్లు విస్తరిస్తున్న మల్లెతీగ, వేరే చెట్టులను బంధించకుండా, పైకి పెరగలేదు. […]