పిల్లలారా, సహనము కలవాడికి మాత్రమే ఆధ్యాత్మిక జీవితము సాధ్యము. బాహ్యాచారాలను మాత్రం చూసి ఒకరి ఆధ్యాత్మికోన్నతిని కొలవటము సాధ్యం కాదు. ఒక సాధకుడు ప్రతికూల పరిస్థితులలో ఎలా ప్రతిస్పందిస్తున్నాడు అన్నదాని ఆధారంగా అతడి ఆధ్యాత్మిక పురోగతిని కొంతవరకు అర్థము చేసుకోవచ్చు. చిన్న విషయానికి కూడా కోపించేవాడు లోకానికి దారెలా చూపగలడు? పిల్లలారా, సహనము ఉన్నవాడు మాత్రమే ఇతరులకు దారి చూపగలడు. అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించాలి. ఒక కుర్చీలో ఎంతమంది కూర్చున్నా అది ఫిర్యాదు చేయదు. అదే విధంగా, […]