పిల్లలారా, గుర్రపుడెక్కతో మూసుకుపోయిన నీటిలో పడవ నడపటము ప్రయాసమే. గుర్రపుడెక్కను తొలగించినాక పడవ వేగంగా ముందుకు వెళ్తుంది. అదే విధంగా, మనోమాలిన్యాలను జపముతో తొలగించితే ధ్యానము వేగవంతమవుతుంది. ప్రాణాయమము సరిగా చేయకపోతే ఎంత ప్రమాదకరమో అలాంటిదే శ్రద్ధ లేకుండా నిరంతర జపము చేయటము. జపము చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు వేరే ఆలోచనలను దూరంగా ఉంచాలి. రూపములోనో, మంత్రాక్షరములలోనో మనస్సుని ఏకాగ్రము చేయటానికి జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలారా, మంత్రము సదా జపించాలి. విశ్రమము లేకుండా జపించటము మనస్సుకు నేర్పించాలి. […]