పిల్లలారా, సముద్రపు అలలను నిరోధించడానికి తీరమున్నది. ఆధ్యాత్మిక జీవితంలో, మనస్సు యొక్క అలలను నిరోధించేది వ్రతాచరణలే. ఏకాదశి, పౌర్ణమి మొదలైన దినాలలో వాతావరణం పూర్తిగా కలుషితమై ఉంటుంది. ఈ రోజులలో పండ్లు మాత్రమే భుజించి, మౌనవ్రతము ఆచరించటం మంచిది. పండ్లు తోలుతో కప్పబడి ఉండటం వలన వాతావరణ కాలుష్యం వాటిపై అంతగా ప్రభావం చూపదు. ఈ రోజులు సాధనకు ఎంతో అనుకూలమైనవి. అప్పుడు, మన ఆలోచనలేవైనా; ఆధ్యాత్మికము కానీ, భౌతికము కానీ, వాటిలో మరింత ఏకాగ్రతను పొందవచ్చు. […]