5 ఏప్రిల్ 2011, కెన్యా అమ్మ సన్నిధిలో, కెన్యా గణ తంత్ర రాజ్య ఉప రాష్ట్రపతి కలొంఝో మ్యుసియొక, “మాతా అమృతానందమయి మఠం – కెన్యా”చే నిర్మించబడిన నూతన బాలల గృహానికి ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ అతీ నది ఒడ్డున నిర్వహించిన ఒక బహిరంగ కార్యక్రమంలో, ఉప రాష్ట్రపతితో పాటు చాలా మంది అతిథులు పాలు పంచుకున్నారు: క్రీడల మరియు సంస్కృతి సహాయ మంత్రి శ్రీమతి వావిన్యా న్దెతి, అనేక మంది పార్లమెంటు సభ్యులు, జిల్లా కలెక్టరు, […]