అమృతపురి చరిత్రలో అనేక అపూర్వమైన జంతువులు ఉన్నాయి. అమ్మ యొక్క సాధనా కాలంలో అనేక జీవులు సాయం చేశాయి: అమ్మ ధ్యానం చేసేటప్పుడు అమ్మ ముందు ఆహారం పడవేసిన గ్రద్ద; అమ్మ కోసం ఎవ్వరూ తాకని ఆహార ప్యాకెట్లను తన నోట కరుచుకుని తీసుకువచ్చిన కుక్క; అమ్మకు పాలు ఇవ్వటానికి తాడు తెంపుకుని వచ్చిన ఆవు మొదలైనవి. జంతు రాజ్యానికి చెందిన అనేక ఇతర అసాధారణ జీవాలు అనేక సంవత్సరాలు తరబడి అమృతపురిలో కనిపించేవి. వాటిలో గుడికి […]