పిల్లలారా, నాలుక యొక్క రుచిని విడిచిపెట్టకపోతే హృదయం యొక్క రుచిని అనుభవించలేము. ఈ ఆహారం తినాలి, ఇది తినకూడదు అని ఖచ్చితంగా చెప్పటం సాధ్యం కాదు. వాతావరణములోని మార్పులననుసరించి ఆహారానికి మన పైన ఉన్న ప్రభావం కూడా మారుతుంటుంది. ఇక్కడ (దక్షిణ భారతదేశంలో) తినకూడనిది హిమాలయాల్లో మంచిదవుతుంది. ఆహారం తినడానికి వచ్చి కూర్చున్నప్పుడు భగవంతుని స్మరించిన తరువాతే తినాలి. అందుకే తినడానికి ముందు మంత్రం జపించేది. ఆహారం ముందు ఉన్నప్పుడే మన సహనాన్ని పరీక్షించటానికి సరైన […]
Tag / అమృతవాణి
పిల్లలారా, కోరిక మరియు స్వార్థం నుండే అహంకారముదయిస్తుంది. ఇది సహజంగా జరిగినది కాదు, సృష్టించబడినది. మనకు రావలసిన బాకీ వసూలు చేయడానికి ఒక చోటుకి వెళ్లామనుకోండి. రెండు వందల రూపాయలు వస్తాయని ఆశించాము. కానీ యాభై రూపాయలు మాత్రమే వచ్చాయి. కోపంతో ఊగిపోతూ వాడిని కొడతాము. ఆ తరువాత కోర్టులో కేసు కూడా అవుతుంది. కోరిన మొత్తము దొరక్కపోవటం వలనే కదా కోపము వచ్చింది. చివరకు కోర్టు వరకు వెళ్ళవలసి వచ్చింది. శిక్ష పడితే భగవంతుడిని నిందించి […]
నూతన సంవత్సరం, ఆదివారం, 00:10ని״కి, 1 జనవరి 2012 – అమృతపురిలో “మన జీవితాలు మరియు సకల ప్రాణికోటి జీవితాలు మంగళప్రదమవ్వాలని ఈ సందర్భంగా అమ్మ ప్రార్థన. అమ్మ అందరి పిల్లల జీవితాలలోనూ మరియు ప్రపంచంలోనూ, సానుకూల మార్పులు తీసుకువచ్చే దివ్య శక్తి ఉదయించుగాక. ఈ నూతన సంవత్సరము ఒక నవ్య వ్యక్తి, ఒక నవ్య సమాజము జన్మించటానికి దారి తీయాలని అమ్మ ప్రార్థన.” “నూతన సంవత్సరమనేది ఒక మంచి అవకాశం. జనులందరూ తమ గత సంవత్సరములో […]
తుఫానులో మహావృక్షాలు వేళ్ళతో సహా పెకలించుకుపోతాయి. కట్టడాలు కూలిపోతాయి. కానీ ఎంత పెద్ద తుఫానైనా ఒక గడ్డిపోచను ఏమీ చేయలేదు. పిల్లలారా, అణకువ యొక్క మహత్వమిదే. ఇతరుల ముందు తల వంచడమనేది దుర్బలత కాదు. ఒక గడ్డిపోచ ముందు కూడా తల వంచగలిగే ఔన్నత్యము మనలో పెంపొందాలి. ఒకడు స్నానం చేయడానికి నదిలోకి దిగి, ‘నేను నదికి తల వంచను, నేను మునగను’ అని అంటే అతడి శరీరంలోని మలినాలు పోవు. ఆధ్యాత్మిక జీవి ఇతరుల ముందు […]