తుఫానులో మహావృక్షాలు వేళ్ళతో సహా పెకలించుకుపోతాయి. కట్టడాలు కూలిపోతాయి. కానీ ఎంత పెద్ద తుఫానైనా ఒక గడ్డిపోచను ఏమీ చేయలేదు. పిల్లలారా, అణకువ యొక్క మహత్వమిదే. ఇతరుల ముందు తల వంచడమనేది దుర్బలత కాదు. ఒక గడ్డిపోచ ముందు కూడా తల వంచగలిగే ఔన్నత్యము మనలో పెంపొందాలి. ఒకడు స్నానం చేయడానికి నదిలోకి దిగి, ‘నేను నదికి తల వంచను, నేను మునగను’ అని అంటే అతడి శరీరంలోని మలినాలు పోవు. ఆధ్యాత్మిక జీవి ఇతరుల ముందు […]