ప్రశ్న: సాధకులకు కోపం రాకూడదు అని ఎందుకు అంటారు?
అమ్మ: పిల్లల్లారా, ఆధ్యాత్మిక అన్వేషకునికి కోపం రాకూడదు. కోపం వచ్చినప్పుడు మనం సాధనద్వారా పొందిన శక్తినంతటినీ నష్టపోతాము. కేవలం మన నోటి ద్వారానే కాదు మనం శక్తిని కోల్పోయేది, మన ప్రతి రంధ్రము నుండి కూడా శక్తిని నష్టపోతుంటాము. సిగరెట్టు లైటరు 10-20 మార్లు ఉపయోగిస్తే దానిలో ఉన్న ఇంధనం ఖర్చు అవుతుంది. ఇది కనిపించనప్పటికీ మనకు తెలుసు. పిల్లల్లారా, అదే విధంగా ఉన్నతమైన ఆలోచనల ద్వారా సంపాదించిన శక్తిని వివిధ కారణాల ద్వారా మనం కోల్పోతుంటాము. ఇది మనం గుర్తు చేసుకుంటుండాలి.


Download Amma App and stay connected to Amma